Share News

ఎత్తు పెంపు ప్రతిపాదనను నిలిపేయాలి

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:23 AM

ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు ప్రతిపాదనను తక్షణమే నిలిపేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించాలని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఎత్తు పెంపు ప్రతిపాదనను నిలిపేయాలి
మాట్లాడుతున్న కుంచం వెంకటసుబ్బారెడ్డి

రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి

చాగలమర్రి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు ప్రతిపాదనను తక్షణమే నిలిపేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించాలని రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కుంచం వెంకటసుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం చాగలమర్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర రైతులు నీటి కొరత ఎదుర్కొవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనకట్ట ఎత్తు పెంచే ప్రతిపాదనను నిలిపి వేయుటకు కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌, సీఎంకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. అలా చేయనిచో కూటమి ప్రభుత్వం రాయల సీమకు ద్రోహులుగా పరిగణించాల్సి వస్తుందని ఆరోపించారు. రాయలసీమ సాదన సమితీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 12:23 AM