Share News

శ్రీశైలంలో శృంగేరి పీఠాధిపతి

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:01 PM

శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి శ్రీశైలానికి శనివారం రాత్రి వచ్చారు. సాక్షి గణపతిని దర్శించుకున్నారు.

శ్రీశైలంలో శృంగేరి పీఠాధిపతి
పీఠాధిపతి స్వాగతం పలుకుతున్న శ్రీశైల క్షేత్రం అధికారులు

శ్రీశైలం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి శ్రీశైలానికి శనివారం రాత్రి వచ్చారు. సాక్షి గణపతిని దర్శించుకున్నారు. ముందుగా ఈవో శ్రీనివాసరావు, అధికారులు, అర్చక వేదపండితులు ఘనంగా స్వాగతం పలికారు. పీఠాధిపతి ఆదివారం పాలధార పంచధార క్షేత్రంలో శారదాదేవి అమ్మవారు, ఆదిశంకరాచార్యుల విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొననున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 11:01 PM