Share News

వైభవంగా మల్లన్న రథోత్సవం

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:48 PM

జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల రథోత్సవం వైభవోపేతంగా జరిగింది.

వైభవంగా  మల్లన్న రథోత్సవం

ఉగాది పర్వదిన ప్రత్యేక పూజలు

శ్రీశైలం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. ఉగాది మహోత్సవాలలో గురువారం నాల్గవ రోజు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి సాత్వికబలి సమర్పించి రథంపై ఊరేగించారు. కర్నాటక, మహారాష్ట్రలకు చెందిన సుమారు లక్ష మంది భక్తులు ఇందులో పాల్గొన్నారు. రఽథోత్సవంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, చెంచుల కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

రమా వాణి సేవిత రాజరాజేశ్వరిగా భ్రామరి

ఉగాది ఉత్సవాలలో భాగంగా అక్కమహాదేవి అలం కార మండపంలో శ్రీ భ్రమరాంబ దేవిని రమా వాణి సేవిత రాజరాజేశ్వరిగా అలంకరించారు. చతుర్భు జాలు కలిగిన ఈ దేవి పాశం, అంకుశం, పద్మం, చెరుకుగడను ధరించి భక్తులకు దర్శనమిచ్చింది.

Updated Date - Mar 19 , 2026 | 11:49 PM