Share News

వైభవంగా చౌడేశ్వరీదేవి తిరుగు రథోత్సవం

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:16 PM

పట్టణంలో వెలసిన చౌడేశ్వరీదేవి అమ్మవారి తిరుగు రథోత్సవం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది.

వైభవంగా చౌడేశ్వరీదేవి తిరుగు రథోత్సవం
భక్తుల కోలాహలం నడుమ అమ్మవారి తిరుగు రథోత్సవం

కోడుమూరు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): పట్టణంలో వెలసిన చౌడేశ్వరీదేవి అమ్మవారి తిరుగు రథోత్సవం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఆటగార దేవాంగ దైవచార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలను తిలకించేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తేరుబజార్‌కు చేరుకున్నారు. దీంతో పురవీధులు కిక్కిరిసిపోయాయి. ముందుగా దేవాలయంలో చౌడేశ్వరీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథానికి పూజల అనంతరం తిరుగు రథోత్సవం ప్రారంభమైంది. అశేష జనవాహిని మధ్య అమ్మవారి వేడుక వైభవంగా సాగింది. రథం ముందుకు సాగుతుండగా భక్తులు రథంపై పూల వర్షం కురిపించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘనటలు జరగకుండా సీఐ తబ్రేజ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు డీవై స్వామి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటగారదేవాంగ దైవచార సంఘం సభ్యులు నాగప్ప, కావ నాగరాజు, మల్లి, శేఖర్‌, బ్రహ్మయ్య చెప్పారు. బుధవారం పారువేట, గురువారం వసంతోత్సవంతో అమ్మవారి జాతర ఉత్సవాలు ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Feb 03 , 2026 | 11:16 PM