వైభవంగా అహోబిలేశుడి రఽథోత్సవం
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:54 PM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మాత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో బుధవారం జ్వాలా నరసింహ స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు.
ఆళ్లగడ్డ, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మాత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో బుధవారం జ్వాలా నరసింహ స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. చీఫ్ అడ్మినిస్ట్రేటర్ పార్థసారథి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, అర్చకులు సౌమ్యనారాయణన్ సాయంత్రం స్వామిని పుష్పపల్లకిలో కొలువు దీర్చి మాడ వీధుల్లో విహరింప చేశారు. దిగువ అహోబిలంలో ఉదయం ప్రహ్లాద వరద స్వామివారికి నవకలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం విశేష పూజలతో ప్రత్యేక అలంకారంతో తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఎండలు విపరీతంగా ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లుచేశారు. ఈఉత్సవాలకు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.