దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ సంకల్పం
ABN , Publish Date - Apr 03 , 2026 | 11:29 PM
వేసవిలో ఆదోని ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ సంకల్పమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ
ఆదోని, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): వేసవిలో ఆదోని ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడమే ప్రభుత్వ సంకల్పమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. రూ.450 కోట్లతో జరుగుతున్న ఎల్లెల్సీ కెనాల్ ఆధునీకీకరణ పనులను శుక్రవారం ఆమె అధికారులతో కలిసి పరిశీ లించారు. కృష్ణమ్మ మాట్లాడుతూ కెనాల్ పరిధిలోని 73 ఎస్‌ఎస్ ట్యాం కులు, 13 చెరువులను పూర్తి స్థాయిలో నింపడమే లక్ష్యంగా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల కంటే ప్రజల దాహా ర్తిని తీర్చడమే ముఖ్యమని భావించి, కొనసాగుతున్న రూ.450కోట్ల పనులను 25 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. నీటి నిల్వ ప్రక్రియ పూర్తయ్యాక పనులు తిరిగి ప్రారంభమవుతాయన్నారు. తాగు నీటి కోసం కేటాయించిన నీటిని అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరిగేషన్ డీఈ షఫివుల్లాతో కలిసి కాలువ పరిస్థితిని, నీటి ప్రవాహ వేగాన్ని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా గండ్లు పడకుండా, చిట్టచివరి ట్యాంకు వరకు నీరుచేరేలా చూడాలని అధికారు లను ఆదేశించారు. ఎల్‌ఎల్‌సీ డిస్ర్టిబ్యూటరీ చైర్మన్ రామస్వామి, నాయకులు గోపాల్, మల్లికార్జున, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు.