పేదల సొంతింటి కల ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Mar 30 , 2026 | 11:40 PM
పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు.
శరీననగర్‌లో నూతన గృహాన్ని ప్రారంభించిన కలెక్టర్ సిరి
కల్లూరు, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. సోమవారం నగరంలోని శరీననగర్‌లో నాగన్న, లక్ష్మీదేవి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లా డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 2.5 లక్షల సామూహిక గృహప్ర వేశాలకు చర్యలు తీసుకుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నాగన్న, లక్ష్మీదేవిలకు సాంప్రదాయబద్దంగా కొత్త దుస్తులను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాసరరెడ్డి, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.