మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:25 PM
డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోందని న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు.
న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్
నంద్యాల నూనెపల్లి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోందని న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. నంద్యాల కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్‌ను శుక్రవారం కలెక్టర్ రాజకుమారి, జేసీ కార్తీక్‌తో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఈ క్యాంటీన్ 24 గంటల పాటు పనిచేస్తుందని తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ తృప్తి క్యాంటీన్‌ను ఎస్‌హెచ్‌జీ మహిళలు సమర్థవంతంగా నిర్వహించి మంచి లాభాలు సాధిం చాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి జిల్లాలో పూర్తి స్థాయి సహకారం అందిస్తున్నామని, ఇందులో హార్టికల్చర్ శాఖ ద్వారా 35 శాతం సబ్సిడీతో పాటు మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తు న్నామని చెప్పారు. జిల్లాలో మిల్లెట్స్ ప్రాసెసింగ్‌కు విస్తృత అవకాశా లున్నాయని, స్వయం సహాయక సంఘ సభ్యులు అవకాశాలను వినియో గించుకోవాలని సూచించారు.