రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:21 PM
రాష్ట్రంలో నెలకొన్న కరువు దృష్ట్యా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య
పత్తికొండ టౌన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నెలకొన్న కరువు దృష్ట్యా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య డిమాండ్ చేశారు. సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం పట్టణంలో సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఏర్పడిన ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవక పంటలన్నీ ఎండిపోయి తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు ఎకరాకు రూ.50వేలు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలన్నారు. పట్టణ కార్యదర్శి రామాంజ నేయులు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజాసాహెబ్, మండల కార్యదర్శి కారుమంచి, రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి సురేంద్రకుమార్, ప్రజా సంఘాల నాయకులు గురుదాస్, ఎం.కె.సుంకన్న, రంగన్న తదితరులు పాల్గొన్నారు.