Share News

నంద్యాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:46 AM

నంద్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు.

నంద్యాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి, అధికారులు

మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

నంద్యాల టౌన్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): నంద్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన మంత్రి మాట్లాడుతూ పట్టణంలోని మున్సిపల్‌ అభివృద్ధి పనులు తమ హయాంలోనే జరిగినవి అని అన్నారు. అవసరాన్ని బట్టి ప్రాధాన్యాన్ని గుర్తించి నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు. కాలవ్యవధిలోనే పనులు పూర్తి చేసి సేవలు ప్రజలకు అందు బాటులోకి తీసుకురావాలన్నారు. మల్దార్‌ పేటలో కమ్యూనిటీ టాయిలెట్స్‌, డ్రెయిన్స్‌ పనులు, పద్మావతి నగర్‌లో సుందరీకరణకు డివైడర్‌ పనులకు, నందమూరి న గర్‌లో పారిశుధ్యం మెరుగుపడడానికి డ్రెయిన్స్‌కు శంకుస్థాప న చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకుడు ఎన్‌ఎండీ ఫయాజ్‌, కమిషనర్‌ బండి శేషన్న, వార్డు ఇన్‌చార్జిలు, మున్సిపల్‌ సిబ్బంది లు పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 12:46 AM