హామీలను విస్మరించిన ప్రభుత్వం
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:09 AM
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌కుమార్ ఆరోపించారు.
ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌కుమార్
కర్నూలు ఎడ్యుకేషన, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌కుమార్ ఆరోపించారు. బుధవారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చెవిలో పూలు పెట్టుకుని జాబ్‌లెస్ క్యాలెండర్ వద్దంటూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌లెస్ క్యాలెండర్‌ను రద్దు చేసి పూర్తిస్థాయిలో ఖాళీ పోస్టు లకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో లక్షల సంఖ్యలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తూతూమంత్రంగా అమలు చేస్తుం దన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను ఏకతాటిపైకి తెచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరిం చారు. ఏఐవైఎప్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా సహాయ కార్యదర్శి బీసన్న, రాజీవ్, షాబీర్ బాషా, జిల్లా సమితి సభ్యులు రాజు, వినోద్, నిరుద్యోగులు పాల్గొన్నారు.