కొలువుదీరిన పాలకవర్గం
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:25 AM
ప్రత్యేకాధికారుల పాలనకు తెరపడింది. సోమవారం డోన్, ఆళ్లగడ్డ మున్సిపాలిటీలతో పాటు, బేతంచెర్ల నగర పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. డోన్‌లో చైర్‌పర్సన్‌గా కోట్ల సుజాతమ్మ, ఆళ్లగడ్డలో ఆనీఫా, బేతంచెర్లలో దస్తగిరితో పాటు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
డోన్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సుజాతమ్మ, ఆళ్లగడ్డలో ఆనీషా, బేతంచెర్ల చైర్మన్‌గా దస్తగిరి ప్రమాణ స్వీకారం
డోన్ టౌన్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తనకు అవకాశం ఇచ్చిన డోన్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కోట్ల సుజాతమ్మ అన్నారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఆర్డీవో నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించారు. చైర్‌పర్సన్ కోట్ల సుజాతమ్మతో పాటు వైస్ చైర్‌పర్సన్ తలారి శాంతి, కౌన్సిలర్లచే ఆర్డీవో ప్రమాణ స్వీకారం చేయించారు. కౌన్సిలర్లు కోట్రికే ఫణిరాజ్, ఎన్‌ఈ సరోజ, బద్దల సుబ్బలక్ష్మి, పటాన్ భైరున్నిసా, పోతుల యశ్వంత్, షేక్ అబ్దుల్ రవూఫ్, ఈడిగ రాఘవేంద్రగౌడు, షేక్ మాబు హుశేన్, భాష్యం శ్రీధర్‌గౌడు, కునిశెట్టి రాయల్ కృష్ణవేణి, కేఈ హరీష్ గౌడు, ఈడిగ లక్ష్మీదేవి, రేష్మా, కొమ్ము ధీనా, పెనుగొండ ధనుంజయ, మరియదాస్ ప్రమాణ స్వీకారం చేశారు. సుజాతమ్మ మాట్లాడుతూ పట్టణలోని ప్రతి వార్డు అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడం తన ప్రధాన లక్ష్యమన్నారు. డోన్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం వైస్ చైర్‌పర్సన్‌ను కూటమి కౌన్సిలర్లు 6వ వార్డుకు చెందిన తలారి శాంతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైసీపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం అనంతరం వైస్ చైర్మన్ ఎన్నికలో పాల్గొనకుండా గైర్హాజరయ్యారు. చైర్‌పర్సన్ కోట్ల సుజాతమ్మను ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డిని సన్మానించారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్రికె గాయత్రీదేవి, మర్రి గోవిందరాజులు, కోట్ల రాఘవేంద్ర రెడ్డి, మండల అధ్యక్షుడు దశరథరామిరెడ్డి, పెద్దకేశవయ్యగౌడు, టీఈ రాఘవేంద్రగౌడు, శేషఫణిగౌడు, ఓబులాపురం శేషిరెడ్డి, విజయ రెడ్డి, కమలాపురం రేగటి అర్జున్ రెడ్డి, మర్రి గోవిందరాజులు, హుశేనాపురం సింగిల్ విండో చైర్మన్ సీమ సుధాకర్ రెడ్డి, మాధవరం ఎంపీటీసీ సీమ సుబ్బారెడ్డి, ఓంప్రకాష్, ఐటీఐ రాముడు, ఎంపీపీ రామాంజనేయులు, భాస్కర్ నాయుడు, కొత్తపల్లి రంజిత్ కిరణ్, రాజపుత్ర కమలేష్ తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్బన్ సీఐ ఇంతియాజ్ బాషాతో పాటు ఎస్‌ఐ నాగరాజు, ఏఎ్‌సఐ చెంచయ్య, పోలీసు సిబ్బంది మద్దిలేటి బందోబస్తు నిర్వహించారు.
టీడీపీలోనే మహిళలకు ప్రాధాన్యం: ఎంపీ భైరెడ్డి శబరి
తెలుగుదేశం పార్టీలోనే మహిళలకు ప్రాదాన్యం లభిస్తుందని నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే స్వగృహంలో చైర్‌పర్సన్ కోట్ల సుజాతమ్మ, వైస్ చైర్‌పర్సన్ తలారి శాంతినిఅభినందించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు గెలిపించారన్నారు. ప్రజలకు మంచి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం చైర్‌పర్సన్ కోట్ల సుజాతమ్మ పట్టణంలోని ప్రధాన కూడలికి కాలినడకన వెళ్లి మహాత్మాగాంధీ, వాల్మీకి, కేఈ మాదన్న, వివేకానంద, అమరజీవి పొట్టి శ్రీరాములు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళి అర్పించారు.
ఆళ్లగడ్డను అభివృద్ధి చేసి చూపిస్తాం
ఆళ్లగడ్డ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. సోమవారం కార్యాలయంలో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం ప్రిసైడింగ్ అధికారి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా ఎమ్మెల్యే అఖిలప్రియ, భార్గవ్‌రాం, భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా చైర్‌పర్సన్‌గా ఆనీఫాచే ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. కౌన్సిలర్లు డాక్టర్ రాంగోపాల్‌రెడ్డి, హుసెన్‌బాషా, శ్రీనివాసరెడ్డి, లక్ష్మిదేవి, గంగాధర్, స్రవంతి, పద్మావతి, శివకుమార్, మహుమ్మద్ సలాం, డాక్టర్ వసంత, విజయభాస్కర్‌రెడ్డి, రాజశేఖర్, బీబీ, పుష్పలత, మరియమ్మ, వలక్ష్మి, నూర్‌మహుమ్మద్, రాజేశ్వరి, రవిచంద్రారెడ్డి, పద్మావతమ్మ, చిన్నఓబన్న, హిమబిందు, రత్నమయ్య, అరుణ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా వైస్‌చైర్మన్ ఎన్నికను పీవో వాయిదా వేశారు. చైర్‌పర్సన్ ఆనీసా మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో తాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలు, రోడ్ల నిర్మాణం పరిష్కరిస్తానన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీకి రూ.21 కోట్లు మంజూరయ్యాయని, రూ.5కోట్లతో డిగ్రీ కళాశాల, రెండు పార్కులు, రూ.3కోట్లతో నూతన మున్సిపల్ భవనం నిర్మిస్తున్నామన్నారు. పార్టీ పరిశీలకుడు దేవల్ల మురళి, కమిషనర్ కిషోర్, ఇచార్జీ శ్యానిటరీ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి, శివరామిరెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
నగర పంచాయతీ చైర్మన్‌గా దస్తగిరి..
బేతంచెర్ల, నవంబరు 23(ఆంధ్రజ్యోతి):నగర పంచాయతీ చైర్మన్‌గా దస్తగిరితో ఆర్డీవో రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ హరి ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం 28 మంది కౌన్సిర్ల ప్రమాణ స్వీకారం చేయించారు. వీరిలో 18 మంది వైసీపీ, 10 మంది టీడీపీకి చెందినవారున్నారు.వైస్ చైర్మన్‌గా 3వ వార్డు వైసీసీ కౌన్సిలర్ చింతల నాగిరెడ్డిని కౌన్సిలర్లు ఎనున్నారు. వీరికి డిక్లరేట్ అందజేశారు. వైసీపీ కార్యాలయంలో పాలకవర్గాన్ని మాజీ మంత్రి బుగ్గన అభినందించారు. 11వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌గా నూతనంగా షేక్షావలి చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. సీఐలు వెంకటేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, ఎస్‌ఐ రమేష్ బాబు బందోబస్తు నిర్వహించారు.