పథకాలను ప్రజలందరికీ చేర్చడమే లక్ష్యం
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:13 AM
సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి
కర్నూలు రూరల్, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): సంక్షేమ పథకాలను ప్రజలందరికీ చేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు రూరల్ మండలం ఆర్.కొంతలపాడు గ్రామంలో బుధవారం ప్రభుత్వం రెండేళ్ల వ్యవధిలో చేపట్టిన సంక్షేమం-అభివృద్ధిలో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికీ తిరిగి ప్రజలకు కరపత్రాలను అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. గత వైసీపీ హయాంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. కార్యక్రమంలో కొంతలపాడు మాజీ సర్పంచు మహానంది, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు బోయ రామాంజనేయులు, జిల్లా టీడీపీ మహిళ ప్రధాన కార్యదర్శి బండారి పద్మ, వెంకాయపల్లె చైర్మన బోయ నాగేంద్ర, స్థానిక నాయకులు శివారెడ్డి, గిడ్డయ్య, ఉపసర్పంచు గిడ్డయ్య, మునిరెడ్డి, మద్దిలేటి, లోకరెడ్డి పాల్గొన్నారు.