ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ABN , Publish Date - May 29 , 2026 | 11:49 PM
ప్రజా సమస్యల పరిష్కారమే ఽధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని కలెక్టర్ డా. సిరి తెలిపారు.
కలెక్టర్ సిరి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఓర్వకల్లు, మే 29 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే ఽధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని కలెక్టర్ డా. సిరి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఒక నెల.. ఒక నియోజకవర్గం.. నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పాణ్యం నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఓర్వకల్లులోని జీవేశ్వరస్వామి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. సిరి, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. పాణ్యం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భూ సమస్యలు, రీసర్వే లోపాలు, వృద్ధాప్య పించన్లు, ఇళ్ల స్థలాలు, తాగునీరు, మురుగు కాలువలు, విద్యుత్ స్తంభాలు, పొలాలకు వెళ్లే రహదారులు, సర్వీసు రోడ్లు సంబంధించిన అర్జీలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ డా. సిరి అధికారులను అదేశించారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమం ప్రారం భించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, హౌసింగ్ పీడీ చిరం జీవి, తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీవో నాగఅనుసూయ, ఎంఈవో ఓంకార్ యాదవ్, జిల్లా, మండల స్థాయి అఽధికారులు పాల్గొన్నారు.