ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ABN , Publish Date - May 16 , 2026 | 12:23 AM
ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు.
కలెక్టర్ సిరి
ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలి
పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత
కల్లూరు, మే 15 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. శుక్రవారం పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం నిర్వహించిన కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయి పబ్లిక్ గ్రీవెన్స్(పీజీఆర్‌ఎ్‌స) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పీజీఆర్‌ఎస్ నిర్వహణపై సీఎం ప్రత్యేక దృష్టి
ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి
ప్రతి సోమవారం కలెక్టరేట్, మండల స్థాయిలో పీజీఆర్‌ఎస్ నిర్వహించడంఆనవాయితీగా కొనసాగుతోందని, అలాగే ప్రతి శుక్రవారం నియోజకవర్గస్థాయి గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. ప్రజల ప్రతి సమస్యను పరిష్కరించాలని అన్నారు. ఈ కా ర్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, జిల్లా రెవిన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, కర్నూలు ఇన్‌చార్జ్ ఆర్‌డీఓ అనురాధ, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి పాల్గొన్నారు.