Share News

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - Jul 21 , 2026 | 11:28 PM

ప్రజా సమస్యల పరిష్కా రమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
అర్జీలను స్వీకరిస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కా రమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల, టీడీపీ నాయకుల, కార్యకర్తల అర్జీలను స్వయంగా స్వీకరించారు. ఆయన సంబంఽధిత అధికా రులకు ఫోన్‌లు చేసి అర్జీలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. మంత్రి బీసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కా ర్యక్రమాలను, అభివృద్ధి కార్యక్ర మాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలలనుంచి వివిధవర్గాల ప్రజలు, కూటమి నాయకులు, కార్య కర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్జీలను పరిష్కరించడానికి కృషి చేసిన మంత్రి బీసీని ప్రజలు అభినందించారు.

Updated Date - Jul 21 , 2026 | 11:28 PM