Share News

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - Jul 17 , 2026 | 11:26 PM

ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షెరాన్‌, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
అంగన్‌వాడీలకు సామగ్రి పంపిణీ చేస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే

కలెక్టర్‌ రాజకుమారి

వెలుగోడు, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను గుర్తించి పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షెరాన్‌, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. శుక్రవారం వెలుగోడు తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో వన్‌ మంత్‌ ఫోర్‌ విజిట్‌ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని సానుకూలంగా పరిశీలించి క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలను తూతూ మంత్రంగా పరిశీలించి సమస్య పరిష్కారమైందని నమోదు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని అన్నారు. కార్యక్రమంలో జేసీ సూరజ్‌ ధనుంజయ్‌, డీఈవో జనార్దన్‌రెడ్డి, డీఎస్పీ రామాంజీనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 11:27 PM