నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:20 PM
వినియోగదారులకు అంత రాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యమని ఏపీఎస్పీ డీసీఎల్‌కు చెందిన ఆరు జిల్లాల సీజీఎం(చీఫ్ జనరల్ మేనేజర్) ఆది శేషయ్య అన్నారు.
ఏపీఎస్పీడీసీఎల్ సీజీఎం ఆదిశేషయ్య
మహానంది, పిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు అంత రాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యమని ఏపీఎస్పీ డీసీఎల్‌కు చెందిన ఆరు జిల్లాల సీజీఎం(చీఫ్ జనరల్ మేనేజర్) ఆది శేషయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని బుక్కాపురం గ్రామంలో మండల ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కరెంటోళ్ళ జనబాట కార్యక్రమంను సీజీఎం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన సిబ్బందికి వినియోగదారులకు ఎలాంటి సేవలు అందించాలి, ఎలా విధులు నిర్వహించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామంలోని వినియోగదారులతో కరెంటు సమస్యలపై చర్చించారు. సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంను పరిశీలించారు. కార్యక్రమంలో మండల ట్రాన్స్‌కో సిబ్బంది పాల్గొన్నారు.