Share News

నాణ్యమైన విద్యుత అందించడమే లక్ష్యం

ABN , Publish Date - Feb 04 , 2026 | 12:03 AM

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత అందించడమే లక్ష్యమని ఎస్‌ఈ సుధాకర్‌ కుమార్‌ అన్నారు.

నాణ్యమైన విద్యుత అందించడమే లక్ష్యం
గుండుపాపలలో పర్యటిస్తున్న ఎస్‌ఈ సుధాకర్‌ కుమార్‌

ఎస్‌ఈ సుధాకర్‌ కుమార్‌

దొర్నిపాడు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు నాణ్యమైన విద్యుత అందించడమే లక్ష్యమని ఎస్‌ఈ సుధాకర్‌ కుమార్‌ అన్నారు. మంగళ వారం మండలంలోని గుండుపాపల గ్రామంలో విద్యుత ఏఈ రామ్మోహన ఆధ్వర్యంలో కరెంటోల్లా జనబాట కార్యక్ర మం నిర్వహించారు. ఈ కార్యక్ర మాన్ని విద్యుత సిబ్బంది నిర్వహి స్తుండగా ఎస్‌ఈ ఆకస్మికంగా పాల్గొని పర్యవేక్షించారు. గ్రామంలోని ట్రాన్సఫార్మర్లు, అంగనవాడీ కేంద్రాలు, పాఠశా లను పరిశీలించారు. గ్రామాల్లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా ఆయన వినియోగదారులు విద్యుత సమస్యల పరిష్కారం కోసం కార్యాలయం చుట్టూ తిరగకుండానే వారి వద్దకే సిబ్బంది వెళ్లి కరెంటో ల్లా పల్లెబాట కార్యక్రమంలో పరిష్కరిస్తారని అన్నారు. కార్యక్రమంలో ఏడీఈ సతీష్‌కుమార్‌రెడ్డి, ఏఈ రామ్మోహన, లైనఇనస్పెక్టర్‌ కుక్కల య్య, లైనమెన రంజితనాయక్‌, సర్పంచ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 12:03 AM