నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:26 AM
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
ఘనంగా మెగా పీటీఎం 4.0
కల్లూరు, జూలై 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శుక్రవారం కల్లూరు అర్బనలోని 35వ వార్డు కస్తూరినగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మోగా పీటీఎం-4.0 కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలు, స్థానిక ప్రజాప్రతినిధులతో భాగస్వామ్యాన్ని పెంపొందించడం పాఠశాలల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన చైర్‌పర్సన కె.పార్వతమ్మ, డైరెక్టర్ భాస్కర్‌రావు, పీయూ.మాదన్న, రవిప్రకాష్, టైలర్ నాగరాజు, హెచఎం హుసేన, చైర్మన మహబూబ్‌బాషా, ఎంఈవో శ్రీనివాసులు పాల్గొన్నారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయంతో..
గూడూరు: విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమస్వయంతో కృషి చేయాలని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. మండలంలోని జూలకల్ గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన ‘మెగా పీటీఎం 4.0’కి ఎమ్మెల్యే ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, విద్య విషయంలో ఎలాంటి లోటు లేకుండా కృషి చేస్తోందన్నారు. పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులను అంద జేశారు. విద్యార్థులు, తల్లిద్రండులతో కలిసి సహ పంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారులు సునీలమ్మ, నాగరాజు వ్యవసాయ అధికారి దస్తగిరి రెడ్డి, టీడీపీ నాయకులు కాంతారెడ్డి, దామోదర రెడ్డి, శ్రీనివాసులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఓర్వకల్లు: మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ‘మెగా పీటీఎం 4.0’ ఘనంగా నిర్వహించారు. హుశేనాపురంలో టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్ పాల్గొన్నారు. విద్యార్థులకు తమ తల్లిదండ్రులకు పాదాబివందనం చేసి ఆశీర్వచనాలు పొందారు. తల్లిదండ్రుల కోసం కుర్చీలు, తాడులాగుడు, ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.
కోడుమూరు: స్థానిక జడ్పీ బాలికల హైస్కూల్లో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం 4.0 ఆత్మీయ సమావేశంలో డైట్ కళాశాల అధ్యాపకుడు మువ్వ గోవిందు పాల్గొని మాట్లాడారు. ఎంఈవో రామచం ద్రుడు, టీడీపీ మండల కన్వీనర్ రామక్రిష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షుడు గంగాధర్, పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ శ్రీనివాసులు వైస్ చైర్మన్ సుధాకర్ పాల్గొన్నారు.
కోడుమూరు రూరల్: మండలంలోని గ్రామాల్లో మెగా పేరెంట్స్ టీచర్ ఆత్మీయ సమావేశం 4.0 జరిగింది. అమడ గుంట్ల జడ్పీ పాఠశాల లో హాజరైన మాజీ సర్పంచ వరలక్ష్మీ మాట్లాడు తూ కూటమి ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసిందని తెలిపారు. హెచఎం అనం తయ్యయాదవ్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కర్నూలు అర్బన్: విద్యార్థుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని బొందిలి కార్పొరేషన చైర్మన విక్రమ్ సింగ్ అన్నారు. శుక్రవారం నగరంలోని ప్రకాష్ నగర్ టంగుటూరి ప్రకాశం మున్సిపల్ హైస్కూల్‌లో నిర్వహించిన పేరంట్స్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం నిధులు వేయడం చారిత్రక నిర్ణయం అన్నారు. మంత్రి టీజీ భరత చొరవతో జిల్లాకు భారీగా పరిశ్రమలు రావడంతో నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు.