Share News

తక్షణ సేవలందించడమే లక్ష్యం

ABN , Publish Date - Jan 21 , 2026 | 10:42 PM

ప్రజలకు తక్షణ సేవలు అందించాలనే లక్ష్యంతోనే ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్స్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అన్నారు.

తక్షణ సేవలందించడమే లక్ష్యం
మాట్లాడుతున్న కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి

రెవెన్యూ సమస్యలను డ్రైవ్‌ మోడ్‌లో పరిష్కరించండి

కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి

ఆదోని, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు తక్షణ సేవలు అందించాలనే లక్ష్యంతోనే ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్స్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అన్నారు. బుధవారం ఆదోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై ఆదోని డివిజన్‌కు సంబందించి రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలె క్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూశాఖ పనితీరుపై ప్రజల్లో సంతృి ప్తస్థాయి పెరగాలన్నారు. రెవెన్యూశాఖకు మంచిపేరు వచ్చేలా రెవెన్యూ అధికారులు పని చేయాలన్నారు. 22ఏ, చుక్కల భూములు, ఇనాం నుం చి పట్టా, వెబ్‌ల్యాండ్‌ కరెక్షన్‌ వంటి రెవెన్యూ సమస్యలను డ్రైవ్‌ మోడ్‌ లో పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూశాఖ పనితీరుపై సీఎం స్థాయిలో సమీక్ష జరుగుతున్న నేపథ్యంలో ప్రతి అధికారి మరింత బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు.

సమస్యలను పరిష్కరించండి: జేసీ

రైతుకు-రైతుకు మధ్య ఉన్న సమస్యలను ఫీల్డ్‌కు వెళ్లి పరిష్క రించాలని జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ అన్నారు. తహసీల్దార్‌, సబ్‌కలెక్టర్‌, కలెక్టరేట్‌ స్టాఫ్‌ ఇక్కడే అందుబాటులో ఉన్నందున 22ఏ సమస్యలు, డాటెడ్‌, ఇనాం నుంచి పట్టా, ఇతరుల వంటి భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకట నారాయ ణమ్మ, డివిజన్‌లోని అన్ని మండలాల తహసీల్దార్‌లు, డీటీలు, సర్వేయర్‌లు, కలెక్టరేట్‌, మండలాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.

రైతుల ఆమోదం తరువాతనే..

ఎమ్మిగనూరు: రైతుల ఆమోదం తరువాతనే పట్టాదారు పాసుపుస్తకం ప్రింటింగ్‌ జరగాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి అన్నారు. ఎమ్మిగనూరు మండలంలోని కలుగొట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరంలో డ్రాఫ్ట్‌ పట్టాదారు పాసుపుస్తకాలను ఎలా తయారు చేశారని కలెక్టర్‌ పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ రైతులకు డ్రాఫ్ట్‌ పట్టాదారు పాసుపుస్తకాల గురించి క్షుణ్ణంగా అర్థమయ్యేలా వివరించాలన్నారు. స్థానిక రైతులకు పాసుపుస్తకం డ్రాఫ్ట్‌ కాపీని అందజేశారు. ఆదోని సబ్‌ కలెక్టర్‌ అజయ్‌కుమార్‌, టీడీపీ నాయకుడు కొండన్నగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 10:42 PM