Share News

ప్రమాదాల నివారణే లక్ష్యం

ABN , Publish Date - May 02 , 2026 | 10:29 PM

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు 29 ప్రమాదకర బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి పనులు ముమ్మరం చేసింది. రోడ్డు ప్రమాదా లను నివారించడంతోపాటు ప్రయాణి కుల భద్రతను మెరుగు పరి చేందుకు జిల్లా యంత్రాంగం కీలక చర్యలు చేపట్టింది. ప్రక్రియలో భాగంగా కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షెరాన్‌ నేరుగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

ప్రమాదాల నివారణే లక్ష్యం
రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి

బ్లాక్‌ స్పాట్‌ల గుర్తింపు

నంద్యాల క్రైం, మే 02 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు 29 ప్రమాదకర బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి పనులు ముమ్మరం చేసింది. రోడ్డు ప్రమాదా లను నివారించడంతోపాటు ప్రయాణి కుల భద్రతను మెరుగు పరి చేందుకు జిల్లా యంత్రాంగం కీలక చర్యలు చేపట్టింది. ప్రక్రియలో భాగంగా కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షెరాన్‌ నేరుగా క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. తొలిరోజు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌44) పరిధిలోని 9బ్లాక్‌ స్పాట్‌లను సందర్శించి రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలయ్యేలా సంబంధిత అధికారులను ఆదేశిం చారు. రెండో రోజు శనివారం ఆరు ముఖ్యమైన ప్రాంతాల్లోని బ్లాక్‌స్పాట్‌లను అధికారులు తనిఖీ చేశారు. రానున్న రోజుల్లో ప్రమా దాలను తగ్గించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు పనులు చేపట్టారు.న ంద్యాల చెరువుకట్ట సమీపం లోని బ్లాక్‌స్పాట్‌ వద్ద రోడ్డు వెడల్పు, మలుపులను సరిచేయ డంతో పాటు రోడ్డు సేఫ్టీకి అవసరమైన సూచికలను ఏర్పాటుచే యాలని అధికారులు నిర్ణయించారు. మిగిలిన ఐదు బ్లాక్‌స్పా ట్‌లను కూడా క్షుణ్ణంగా పరిశీలించి నివేదికను తయారుచేసి పనులు ప్రారంభించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున గుప్తా, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌బాషా, తాలూకా యూపీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వర య్య, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ శేషన్న, జాతీయ రహదారి ఈఈ విజయభాస్కర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ సురేష్‌బాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 10:29 PM