శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:25 PM
ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా పోలీసు శాఖ పని చేస్తుందని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు.
ఎస్పీ సునీల్ షెరాన్
కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
కొత్తపల్లి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ప్రజల శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా పోలీసు శాఖ పని చేస్తుందని నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. మంగళవారం కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఎస్పీ అక్కడి పోలీస్ స్టేషన్ పరిసరాలు, లాకప్ గదులు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, పెండింగ్ కేసులను క్షుణ్ణం గా పరిశీలించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ నిర్వహణ భేషుగ్గా ఉందని, స్టేషన్‌లో క్రైం రేటు బాగా తగ్గిందన్నారు.
గిరిజన గూడేన్ని సందర్శించిన ఎస్పీ
కొత్తపల్లి మండలంలోని ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులోని కృష్ణానది ఒడ్డున ఉన్న బలపాలతిప్ప, జానాలగూడెంను ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్, కొత్తపల్లి ఎస్‌ఐ జయశేఖర్, సిబ్బందితో కలిసి ఎస్పీ సునీల్ షేరాన్ సందర్శించారు. గ్రామస్థులతో మాట్లాడి అక్కడి సమస్యలు అడిగి తెలుసు కున్నారు. వారి సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్పీ కొద్దిసేపు కృష్ణానదిలో మరబోటు షికారు చేశారు.