ఆదాయాన్ని పెంచడమే లక్ష్యం
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:12 PM
ప్రభుత్వానికి ఆదాయం పెంచడమే లక్ష్యంగా తమశాఖ పనిచేస్తోందని ఎక్సైజ్ ఈఎస్ సుధీర్‌బాబు పేర్కొన్నారు.
ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు
కర్నూలు అర్బన్, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి ఆదాయం పెంచడమే లక్ష్యంగా తమశాఖ పనిచేస్తోందని ఎక్సైజ్ ఈఎస్ సుధీర్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం తన చాంబర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 17 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. వదంతులు ఎవరూ నమ్మవద్దని, ఏదైనా ఉంటే నేరుగా తమ కార్యాలయాన్ని సంప్రందించి సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రభుత్వం సూచించిన ప్రక్రియలో నిర్భయంగా మద్యం షాపులు దక్కించుకోవాలని కోరారు. ప్రతి మద్యం షాపునకు రూ.3లక్షలతో ఒక్కో దరఖాస్తు ఉంటుందని, ప్రతి దుకాణానికి 4 దరఖాస్తులుంటేనే డిప్ ప్రక్రియకు అర్హత సాధిస్తుందన్నారు. జిల్లాలో 106 షాపులకు గాను 93 దుకాణాలకు లైసెన్సు ప్రక్రియ పూర్తయిందన్నారు. మిగిలిన 17 షాపులకు సంబంధించి అక్టోబరు 5న కలెక్టర్ స మక్షంలో డిప్ ద్వారా మద్యం షాపులను క్కించుకునే వారికి లైసెన్సులు జారీ చేస్తామన్నారు. ఏఈఎస్ రామకృష్ణారెడ్డి, సీఐలు చంద్రహాస్, రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.