స్థూల దేశీయోత్పత్తి వృద్ధ్దే లక్ష్యం
ABN , Publish Date - Jan 13 , 2026 | 11:24 PM
జిల్లా స్థూల దేశీయోత్పత్తి(డీడీపీ) పెంపును లక్ష్యంగా చేసుకుని స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా సమగ్రంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లా స్థూల దేశీయోత్పత్తి(డీడీపీ) పెంపును లక్ష్యంగా చేసుకుని స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా సమగ్రంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని స్వర్ణాంధ్ర 2047 జిల్లా విజన్ ప్లాన్ యూనిట్‌లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి, పీ-4 కార్యక్రమం, జిల్లా ప్రగతి సూచికలపై ఆమె విజన్ ప్లాన్ యూనిట్ సిబ్బందితో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో జిల్లా విజన్ ప్లాన్ యూనిట్‌ను, ఏడు నియోజకవర్గాల్లో ప్రత్యేక విజన్ ప్లాన్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ యూనిట్లలో విధులు నిర్వహించేందుకు యువ నిపుణు లను నియమించామని, వీరు వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవారంగం అభివృద్ధిపై దృష్టి సారిస్తూ మండలాల స్థాయిలో ప్రగతికి తోడ్పడుతున్నారన్నారు. ప్రతి విభాగంలో కనీసం 15 శాతం పురోగతిని సాధించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ ఓబులేసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.