Share News

అభ్యసన సామర్థ్యాల మెరుగుదలే లక్ష్యం

ABN , Publish Date - Mar 12 , 2026 | 11:44 PM

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను బలోపేతం లక్ష్యమని డీఈవో సుధాకర్‌ అన్నారు.

అభ్యసన సామర్థ్యాల మెరుగుదలే లక్ష్యం
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో సుధాకర్‌

డీఈవో సుధాకర్‌

కర్నూలు ఎడ్యుకేషన్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను బలోపేతం లక్ష్యమని డీఈవో సుధాకర్‌ అన్నారు. గురువారం బి.క్యాంపులోని సిల్వర్‌ జూబ్లీ కళాశాలలో రెండు రోజుల వర్క్‌షాపు ముగింపు కార్యక్రమం జరిగింది. ఆయన మా ట్లాడుతూ జిల్లా లోని 26 మండలాల నుంచి ఇద్దరు ఎంఈవోలు, ఇద్దరు సీఆర్‌పీలు, హెచ్‌ ఎంలు, ఎస్‌జీటీలు, స్కూల్‌ అసిస్టెంట్ల చొప్పున 8మంది ఉపాధ్యాయులు వర్క్‌ షాపులో పాల్గొన్నారన్నారు. ఏఎంవో షేక్‌ రఫీ మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు విశ్లేషిం చేందుకు విద్యార్థుల అభ్యసనలో ఉన్న బలహీ నతలను గుర్తించేందుకు వర్క్‌షాపు కీలకంగా ఉపయోగపడుతాయ న్నారు. మాస్టర్‌ ట్రైనర్లు విజయభాస్కర్‌, వినోద్‌, వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 11:44 PM