Share News

కర్నూలు జీజీహెచ్‌ అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - May 23 , 2026 | 11:31 PM

కర్నూలు సర్వజన వైద్యశాల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు.

కర్నూలు జీజీహెచ్‌ అభివృద్ధే లక్ష్యం
భూమిపూజ చేస్తున్న మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు

మంత్రి టీజీ భరత్‌

రూ. 14.67 కోట్లతో 150 పడకల విశ్రాం సదన్‌కు శంకుస్థాపన

కర్నూలు, మే 23(ఆంధ్రజ్యోతి): కర్నూలు సర్వజన వైద్యశాల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. శనివారం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రూ.14.67 కోట్లతో నిర్మించే 150 పడకల విశ్రాం సదన్‌కు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితతో కలిసి శంకుస్థాపన చేశారు. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సౌజన్యంతో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులతో ఈ సదన్‌ నిర్మించనున్నారు. కార్యక్రమంలో ఆ సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వంశీ రామ్మోహన్‌ బుర్రా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2026 | 11:31 PM