ప్రశాంత ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం
ABN , Publish Date - Nov 23 , 2026 | 11:41 PM
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే పోలీసు శాఖ లక్ష్యమని ఎస్పీ సునీల్‌షొరాణ్ తెలిపారు.
ఎస్పీ సునీల్ షొరాణ్
చాగలమర్రి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే పోలీసు శాఖ లక్ష్యమని ఎస్పీ సునీల్‌షొరాణ్ తెలిపారు. సోమవారం చాగలమర్రిలో పంచాయతీ ఎన్నికల ప్రచార సమయంలో చోటు చేసుకున్న ఉద్రిక్తత సంఘటనపై గ్రామంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడులకు పాల్పడిన ఇరువర్గాలపై కేసులు నమోదు చేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని చర్యలు చేపడుతుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పోలీసు శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తుందన్నారు. ఆయన వెంట ఎఆర్ అడిషనల్ ఎస్పీ చిన్నిక్రిష్ణ, ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్, ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ ఉన్నారు.