సమ సమాజ నిర్మాణమే లక్ష్యం
ABN , Publish Date - May 14 , 2026 | 11:10 PM
రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా సమ సమాజ నిర్మాణం జరగాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ తెలిపారు.
ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్
కర్నూలు కలెక్టరేట్, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా సమ సమాజ నిర్మాణం జరగాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా, నియో జకవర్గ, మండల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీకి సంబంధించి మొత్తం 113ఫిర్యాదులు నమోదయ్యాయన్నారు. వాటిలో కేవలం 11కేసులకు మాత్రమే ఇప్పటి వరకు ఏటీఆర్ (యాక్షన్ టేకన్ రిపోర్టు) అందినట్లు తెలిపారు. పరిష్కార రేటు 1 శాతం కంటే తక్కువగా ఉందన్నారు. దాదాపు 102 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాను అత్యాచారరహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. సివిల్ రైట్స్ డే, ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్‌డే నిర్వహించాలని చైర్మన్ కలెక్టర్‌కు సూచించారు. ఎస్సీ కమిషన్ సెక్రటరీ చిన్నరాముడు, అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా పాల్గొన్నారు.