Share News

చేనేతకు మరింత గుర్తింపు తేవటమే లక్ష్యం

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:23 PM

ఎమ్మిగనూరు చేనేతకు మరింత గుర్తింపు తీసుకురావటమే లక్ష్యమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పేర్కోన్నారు.

 చేనేతకు మరింత గుర్తింపు తేవటమే లక్ష్యం
దేశరాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో టెక్స్‌ ఎక్స్‌పోలో పాల్గొని వస్ర్తాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి

ఎమ్మెల్యే బీవీ

ఢిల్లీలో జరుగుతున్న ఏపీ చేనేత వస్త్ర ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్యే బీవీ

ఎమ్మిగనూరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు చేనేతకు మరింత గుర్తింపు తీసుకురావటమే లక్ష్యమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పేర్కోన్నారు. బుదవారం దేశరాజధాని ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన భారత్‌ టెక్స్‌ ఏక్స్‌పో 2026, ఏపీ చేనేత వస్త్రప్రధర్శన, అమ్మకాల మేళాను ఎమ్మెల్యే బీవీ సందర్శించారు. జూలై 19వరకు జరిగే ఈ ప్రధర్శనలో ఎమ్మెల్యే పాల్గొని మన రాష్ర్టానికి చెందిన చేనేతలు తయారు చేసిన వివిదరకాల ఉత్పత్తులను పెట్టిన స్టాళ్లను పరిశీలించారు. ప్రధానంగా ఉప్పాడ జంధాని, మంగళగిరి, వెంకటగిరి పట్టుచీరలు, పొందూరు ఖద్దరు, పెడన కలంకారి వంటి భౌగోళిక గుర్తింపు(జీఐ)35రకాల విశిష్ట చేనేత ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 1.77 లక్షలకు పైగా ఉన్న, ఊపూత రళాకారుల సంక్షేమం, చేనేతరంగ పునరుద్ధ్దరణ, నేతన్నలకు ప్రోత్సాహం కల్పించేందుకు మంత్రి నారా లోకేష్‌ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. చేనేతకు ప్రసిద్ధ చెందిన ఎమ్మిగనూరులో తయారవుతున్న వస్త్రాలకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావటానికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. చేనేత మన సంస్కృతి అని, నేతన్న మన గౌరవమన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 11:23 PM