Share News

పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే లక్ష్యం

ABN , Publish Date - May 25 , 2026 | 10:55 PM

ప్రతి ఇంట్లో పారిశ్రామి కవేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ ఏ.సిరి పేర్కొన్నారు.

పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే లక్ష్యం
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే, కేడీసీసీబీ చైర్మెన్‌

కలెక్టర్‌ ఏ.సిరి

కర్నూలు రూరల్‌, మే25(ఆంధ్రజ్యోతి): ప్రతి ఇంట్లో పారిశ్రామి కవేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ ఏ.సిరి పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈ సమ్మిట్‌-2026లో భాగంగా సోమవారం కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామంలోని టిడ్కో ప్రాంగణంలో 5 ఎకరాల విస్తీర్ణంలో 30గదులతో కూడిన ప్లాటెడ్‌ పరిశ్రమ కాంప్లేక్స్‌ నిర్మాణానికి శిలాఫ లకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీబీ చైర్మన్‌ విష్ణువర్దన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఆమె మాట్లాడుతూ దాదాపు రూ.15కోట్లతో ఈపరిశ్రమలను ని ర్మాణం చేపడుతున్నట్లు వివ రించారు. ఎంఎస్‌ఎంఈలను ప్రతి నియోజ కవర్గంలో నిర్మించనున్నట్లు తెలిపారు. కోడు మూరు ఎమ్మెల్యే మాట్లాడు తూ ఇలాంటి పరిశ్రమలు కోడుమూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కేడీసీసీబీ చైర్మన్‌ డి.విష్ణువర్దన్‌రెడ్డి మా ట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ పార్కుల ద్వారా సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్ర మల స్థాపనకు ప్రత్యేక విధానాలను అమలు చేస్తోందన్నారు. కర్నూలు ఆర్డీవో సందిప్‌కుమార్‌, తహసీల్దార్‌ వెంకటరమేష్‌బాబు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2026 | 10:55 PM