Share News

అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:55 PM

ఎమ్మిగనూరు చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావటమే లక్ష్యమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.

అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం
నేతన్న సేవలో పథకం కింద మంజూరైన రూ. 40 లక్షల చెక్కును లబ్ధిదారులకు అందజేస్తున్న ఎమ్మెల్యే బీవీ, కలెక్టర్‌ సిరి

ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి

చేనేతరంగం అభివృద్ధికి ప్రభుత్వం అండ

కలెక్టర్‌ ఏ. సిరి

‘నేతన్న సేవ’లో ప్రారంభం

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

ఎమ్మిగనూరు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు చేనేతకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావటమే లక్ష్యమని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని శుక్రవారం ఎమ్మిగనూరులో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభు త్వం చేనేతల కోసం ప్రవేశపెట్టిన నేతన్న సేవలో పథకాన్ని ఎమ్మెల్యే బీవీ, కలెక్టర్‌ ఏ సిరిలు ప్రారంభించారు. లబ్ధిదారులకు రూ.40లక్షల చెక్కును అందజేశారు. ఎమ్మెల్యే బీ మాట్లాడుతూ చేనేత అనేది ఒక వృత్తి కాదని భారతీయ సంస్కృతి సంప్రదాయలకు ప్రతీ కగా నిలిచిన కళ అన్నారు. ఎమ్మిగనూరు చేనేత రంగం అభివృద్ధికి ఇంటిగ్రేటెడ్‌ హ్యాండ్లూమ్‌ టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు అత్యంత కీలకమన్నారు. కలెక్టర్‌ ఏ.సిరి మాట్లాడుతూ చేనేతరంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. చేనేతకార్మికుల సంక్షేమం, సంప్రదాయ చేనేత పరిరక్షణ, మార్కెట్‌ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాలో 3,145మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, పవర్‌ లూమ్‌లకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన చేనేత వస్ర్తాల స్టాళ్లను, చేనేత పనిముట్లను పరిశీలించారు. పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర కుర్ణి కార్పొరేషన్‌ చైర్మన్‌ కామర్తి మిన్నప్ప, చేనేత జౌళి శాఖ ఏడీహెచ్‌ నాగరాజరావు, వైడబ్యూసీఎస్‌ కార్యదర్శి వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఏఎంసీ చైర్మన్‌ మల్లయ్య, టీడీపీ చేనేత విభాగం నాయకులు ఎంబీ మహేష్‌, నరసింహులు, రాజు, మాచాని శివశంకర్‌, బండా నరసప్ప, లక్ష్మన్న, చుంచా రంగస్వామి, బుగిడే నాగరాజు, దేవేంద్ర, మాచాని శివకుమార్‌, బీజేపీ, జనసేన నాయకులు నరసింహులు, నవీన్‌ కుమార్‌, చేనేత కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 11:55 PM