Share News

పాఠశాలల అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - May 07 , 2026 | 11:45 PM

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యమని జిల్లా ఏపీసీ నిత్యానందరాజు తెలిపారు.

 పాఠశాలల అభివృద్ధే లక్ష్యం
అసంపూర్తి భవనాలను పరిశీలిస్తున్న జిల్లా ఏపీసీ, ఈఈ

జిల్లా ఏపీసీ నిత్యానందరాజు

చాగలమర్రి, మే 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే లక్ష్యమని జిల్లా ఏపీసీ నిత్యానందరాజు తెలిపారు. గురువారం చాగలమర్రి గ్రామంలో బాలికోన్నత పాఠశాలలో అసంపూర్తిగా ఆగిన పాఠశాల భవనం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన బడి-మన భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ఆగిన పాఠశాలల భవన నిర్మాణ పనులు తిరిగి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది భవనం పనులు నిలిపి వేయాలని, నిధులు కూడా ఖర్చు చేయరాదని చెప్పడంతో హెచ్‌ఎంలు, ఎంఈవోలు నిలిపి వేశారని అన్నారు. జిల్లాలో 683 పాఠశాలల భవనాల పనులు నిలిచి పోయాయని అన్నారు. ఆయా పాఠశాలల్లో నిధులు ఖర్చు చేయకుండా మిగిలి ఉన్నాయని అన్నారు. పాఠశాలలు ప్రారంభించే నాటికి అసంపూర్తిగా ఉన్న భవన పనులు 100 శాతం పూర్తి చేయాలని ఎంఈవోలు, హెచ్‌ఎంలకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఆయన వెంట సర్వశిక్ష ఈఈ సంపత్‌బాబు జిల్లా ఎంఐఎస్‌ కోఆర్డినేటర్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఏఈ మదార్‌వలి, సీఆర్పీ ఖాసీం, వలి ఉన్నారు.

Updated Date - May 07 , 2026 | 11:45 PM