Share News

మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Feb 08 , 2026 | 01:07 AM

మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచి, అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు.

మత్స్యకారుల అభివృద్ధే ధ్యేయం
సుంకేసుల జలాశయంలో చేప పిల్లలను వదులుతున్న ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే దస్తగిరి

కర్నూలు రూరల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచి, అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. జిల్లా మత్స్యకార శాఖ ఆధ్వర్యంలో శనివారం కర్నూలు మండలం సుంకేసుల జలాశ యంలో చేప పిల్లలను ఎంపీ, ఎమ్మెల్యే వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అందులో భాగంగా సుంకేసుల జలాశయంలో దాదాపు 1.66లక్షల చేపపిల్లలను వదిలినట్లు వివరించారు. డీఆర్‌డీవో పీడీ రమణారెడ్డి, మత్సశాఖ డీడీ రంగనాథ్‌బాబు, జిల్లా ఆప్కస్‌ చైర్మన నవీనకుమార్‌, డైరెక్టర్లు రామాంజనేయులు, భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 01:07 AM