Share News

ఉత్తమ ఫలితాలే లక్ష్యం

ABN , Publish Date - Sep 26 , 2026 | 11:54 PM

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడటమే లక్ష్యంగా అధ్యాపకులు పనిచేయాలని ఇంటర్మీడియట్‌ విద్యాధికారి శంకర్‌నాయక్‌ అన్నారు.

ఉత్తమ ఫలితాలే లక్ష్యం
అధ్యాపకులతో మాట్లాడుతున్న ఇంటర్మీడియట్‌ విద్యాధికారి శంకర్‌నాయక్‌

ఇంటర్మీడియట్‌ విద్యాధికారి శంకర్‌నాయక్‌

బనగానపల్లె, సెప్టెంబరు26 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడటమే లక్ష్యంగా అధ్యాపకులు పనిచేయాలని ఇంటర్మీడియట్‌ విద్యాధికారి శంకర్‌నాయక్‌ అన్నారు. శనివారం బనగానపల్లె పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కస్తూర్బా పాఠశాల అధ్యాపకులతో జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారిన సిలబ్‌సకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వం అందించిన స్టడీ మెటీరియల్‌ను విద్యార్థులు సమర్థవంతంగా ఉపయోగించుకొనేలా అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కృష్ణుడు, ఆనంద్‌, నాగేశ్వరరెడ్డి, కిశోర్‌, రామయ్య, శ్రీలత, మోడల్‌స్కూల్‌ సిబ్బంది చంద్రశేఖర్‌రెడ్డి, కేజీవీబీ ప్రిన్సిపాల్‌ సునీత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 11:54 PM