టీబీ నిర్మూలనే లక్ష్యం
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:29 PM
జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు.
హైరిస్క్ గ్రామాల్లో పరీక్షలు వేగవంతం చేయాలి
రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేష్
కల్లూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కల్లూరు మండలం ఉలిందకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన న్యూక్లి యర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్. మల్లికార్జునరెడ్డి, కన్సల్‌టెంట్ డాక్టర్ టి. ధీరజ్‌తో కలిసి ల్యాబ్ రికార్డులు, రిపోర్టులు పరిశీలించారు. అనంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించి టీబీ నియంత్రణ చర్యలపై పలు సూచనలు చేశారు. హైరిస్క్ గ్రామాల్లో ఎక్స్‌రే పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలని, 14 ఏళ్లలోపు ప్రతి ఒక్కరికీ ఒకసారి టీబీ స్ర్కినింగ్ చేపట్టాలని సూచించారు. రెండేళ్లలోపు చిన్నారులకు బీసీజీ టీకాలు తప్పనిసరిగా వేయాలని, టీబీ బాధితులకు కుటుంబ సభ్యులకు కఫం పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాకర్లు ఆనందరావు, మహాలక్ష్మి, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సత్యనారాయణ, ఆరోగ్య పర్యవేక్షకులు నాగరాజు మధుమోహన్ పాల్గొన్నారు.