Share News

ధరల నియంత్రణే లక్ష్యం

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:21 PM

ధరల నియంత్రణే ప్రభుత్వ లక్ష్యమని జేసీ సూరజ్‌ ధనుంజయ్‌ అన్నారు. గురువారం కార్యాలయంలో జిల్లా రైస్‌మిల్లర్లు, హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.

ధరల నియంత్రణే లక్ష్యం
జేసీ సూరజ్‌ ధనుంజయ్‌

ప్రభుత్వ ధరకే బియ్యం విక్రయించండి

జేసీ సూరజ్‌ ధనుంజయ్‌

నంద్యాల నూనెపల్లి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ధరల నియంత్రణే ప్రభుత్వ లక్ష్యమని జేసీ సూరజ్‌ ధనుంజయ్‌ అన్నారు. గురువారం కార్యాలయంలో జిల్లా రైస్‌మిల్లర్లు, హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మిల్లర్లు బియ్యం విక్రయించాలన్నారు. బీపీటీ సోనా, సాంబా (కర్నూల్‌ సోనా రకం బియ్యం) రూ.66, హెచ్‌ఎంటీ, ఆర్‌ ఎన్‌ఆర్‌ రకాలు రూ.76, స్వర్ణమసూరి రూ.47, నంద్యాల సోనా రూ.82 విక్రయించాలని ఆదేశించారు. ప్రతి రైస్‌మిల్లుల వద్ద బియ్యం ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు అధికంగా పెరగడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బియ్యం విక్రయాల్లో అక్రమాలు, అధిక ధరలు వసూల్‌, తూనికలు, కొలతలలో మోసాలు జరగకుండా పౌరసరఫరాల శాఖ, కొలతల శాఖ, విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, జీఎస్టీ అధికారులు సమన్వయం చేసుకుంటూ సంయుక్త తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

Updated Date - Nov 12 , 2026 | 11:21 PM