Share News

ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యం

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:37 PM

నగరంలో వంద శాతం ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యంగా పారిశుధ్య విభాగ యం త్రాంగం పని చేయాలని, అందుకు అనుగుణంగా పిన పాయింట్‌ ప్రోగ్రామ్‌ను పక్కాగా రూపొందించుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు.

ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యం
హెల్ప్‌ డెస్క్‌ను ప్రారంభిస్తున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): నగరంలో వంద శాతం ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యంగా పారిశుధ్య విభాగ యం త్రాంగం పని చేయాలని, అందుకు అనుగుణంగా పిన పాయింట్‌ ప్రోగ్రామ్‌ను పక్కాగా రూపొందించుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు అన్నారు. చల్లా కాంపౌండు, ఐదు రోడ్ల కూడలి, వడ్డేగేరి, కిడ్స్‌వరల్డ్‌, గాంధీనగర్‌ ప్రాంతాల్లో పారిశుధ్య పను లను పరిశీలించారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఎన్ని పనులున్నా తొలి ప్రాధాన్యత ఇంటింటి చెత్తసేకరణకే ఇవ్వాలన్నారు. వంద శాతం ఇం టింటి చెత్తసేకరణలో విఫలమైతే అందుకు సంబంధిత శానిటరీ ఇనస్పెక్టర్‌దే బాధ్యత అని స్పష్టం చేశారు.

హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభం: నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏపీడీపీ ఎంఎస్‌ హెల్ప్‌డెస్క్‌ను గురువారం కమిషనర్‌ చల్లా ఓబులేసు ప్రారం భించారు. ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ అనుమతులు, డీపీఎం ఎస్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంతో పాటు దరఖా స్తుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశామన్నారు. భవన యజమానులు, దరఖాస్తుదారులు, ఆర్కిటెక్ట్‌లు, ఎల్‌టీపీలు డీపీఎంఎస్‌కు సంబంఽధించిన సమస్యల పరిష్కారం కోసం హెల్ప్‌డెస్క్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో ఇనచార్జి డీసీపీ శబ్నం శాసి్త్ర, పట్టణ ప్రణాళిక అధికారి అంజా ద్‌బాషా, సూపరింటెండెంట్‌ సుబ్బన్న పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2026 | 11:37 PM