Share News

అభివృద్ధే ధ్యేయం: మంత్రి బీసీ

ABN , Publish Date - May 04 , 2026 | 11:29 PM

రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధే ధ్యేయం: మంత్రి బీసీ
మాట్లాడుతున్న మంత్రి బీసీ

బనగానపల్లె, మే 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. మండలంలోని రామతీర్థం గ్రామంలో రూ.35 లక్షలతో ఎస్టీ కాలనీ నుంచి ప్రధాన రహదారి వరకు నిర్మించిన సీసీ రోడ్డును సోమవారం రాత్రి మంత్రి ప్రారంభించారు. బహిరంగ సమావేశంలో మంత్రి బీసీ మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో అరాచక పాలన కొనసాగిందని, దీంతో ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. తనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అవమానాలకు గురయ్యామన్నారు. వైసీపీ శ్రేణులు ఎంత బెదిరించినా పసుపు జెండాను వదలకుండా ధైర్యంగా నిలబడి తనతో పాటు నడిచిన టీడీపీ కార్యకర్తలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటామన్నారు. అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో ప్రజలు గమనించాలన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామతీర్థం గ్రామంలో రూ.1.20 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. కక్షలు, కార్పణ్యాలకు టీడీపీ దూరం అని అన్నారు. వైసీపీ హయాంలో తనపై, టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని, అందుకే ప్రజలు గుణపాఠం చెప్పారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి, మద్దిలేటి, శంకర్‌, రామయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2026 | 11:29 PM