డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:16 AM
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ అన్నారు.
నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ
కర్నూలు క్రైం, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ అన్నారు. మంగళవారం ఈగల్ సెల్ ఆధ్వర్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ హాజరై డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమష్టి కృషితో డ్రగ్స్‌ను పారద్రోలుదామని ఆర్టీసీ డ్రైవర్లచే ప్రతిజ్ఞ చేయిం చారు. అనుమానాస్పద పార్సిల్స్ లేదా వ్యక్తులు ఉంటే వెంటనే 1972కు సమాచారం అందించాలన్నారు. యువతను డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచేందుకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈగల్ టీమ్ హెడ్ కానిస్టేబుల్ ఎలిషా, ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజీ ఇనచార్జి ప్రిన్సిపాల్ రామకృష్ణ, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాలకు చెందిన సీనియర్ ఆర్టీసీ డ్రైవర్లు పాల్గొన్నారు.