స్వచ్ఛ శ్రీశైలమే లక్ష్యం
ABN , Publish Date - Feb 05 , 2026 | 11:29 PM
గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా కాకుండా పవిత్ర శ్రీశైల క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి స్వచ్ఛ శ్రీశైలంగా తీర్చుదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మెన్ పట్టాభిరాం పేర్కొన్నారు.
కల్తీ కాదు.. నకిలీ నెయ్యి
రాష్ట్ర స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరాం
శ్రీశైలం, ఫిబ్రవరి5(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా కాకుండా పవిత్ర శ్రీశైల క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి స్వచ్ఛ శ్రీశైలంగా తీర్చుదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మెన్ పట్టాభిరాం పేర్కొన్నారు. ఆయన గురువారం శ్రీశైల మల్లన్న దర్శించుకుని ఆలయ చైర్మన్ రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను ఏమాత్రం అభివృద్ధి చేయలేద న్నారు. కనీసం చెత్తాచెదారాన్ని శుభ్రం చేయకుండా గాలికి వదిలే శారని విమర్శించారు. శ్రీశైలంలో రోజుకు 16 టన్నుల చెత్త డంప్ అవుతోందన్నారు. అతి త్వరలోనే డ్రోన్‌తో సర్వే చేయించి ఈ నెల ఆఖరిలోపు డంపింగ్ సమస్య తీర్చుతామన్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రానికి త్వరలో మూడు ఎలకా్ట్రనిక్ వాహనాలను అందజేస్తామన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో శ్రీశైలాన్ని ప్రత్యేక రోల్ మోడల్‌గా మార్చి, స్వచ్ఛ శ్రీశైలంగా తీర్చిదిద్దుతామన్నారు. గతంలో శ్రీశైలానికి సరఫరా చేసింది కల్తీ నెయ్యి కాదనీ, నకిలీ నెయ్యి అని ధ్వజమొత్తారు. ఈ వ్యవహారంపై ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు సమగ్ర విచారణ చేయాలని తెలియజేశారని అన్నారు. గతంలో జరిగిన నెయ్యి వ్యవహారంపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులు అదేశిస్తే.. అప్పటి రికార్డులను సమగ్ర నివేదికతో పంపుతామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు.