Share News

ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలే లక్ష్యం

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:23 PM

రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలే లక్ష్యం
మంత్రి టీజీ భరత్‌ను సన్మానిస్తున్న ఉపకులపతి, అధ్యాపకులు

జాబ్‌మేళాను సద్వినియోగించుకోవాలి

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ అన్నారు. శనివారం నగరం లోని క్లస్టర్‌ యూనివర్సిటీలో 4వ మెగా జాబ్‌మేళాను ఆయన ప్రారంభించారు. మంత్రి మా ట్లాడుతూ నిరుద్యోగ యువత జాబ్‌మేళాను సద్వినియోగించుకోవాలన్నారు. 19 కంపెనీలు దాదాపు 1500 ఉద్యోగాలు యువతకు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చాయని, మీ ప్రతిభను చూపెట్టి ఉద్యోగాలు సాధించాలన్నారు. జిల్లాలోని ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ హబ్‌లో రిలయన్‌ ్స, ఆగస్తా, గ్రీన్‌ హైడ్రోజన్‌ , సోలార్‌, విండ్‌ పవర్‌ ఉత్పత్తి లాంటి చాలా పెద్ద కంపెనీలు పనులు మొదలు పెట్టాయన్నారు. జయరాజ్‌ ఇస్పాత్‌ విస్తరణ జరుగుతూ ఉందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంఎస్‌ఎంఈలు ఏర్పాటుచేస్తున్నామని, వాటిద్వారా ఉద్యోగాలు వస్తాయన్నారు. క్లస్టర్‌ యూని వర్సిటీ ప్రాంగణంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌, ప్రహరీ నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు. ఇన్‌చార్జి వీసీ వెంకట బసవరావు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ఏర్పాటు కాబడిన క్లస్టర్‌ యూనివర్సీటీ ద్వారా మంచి విద్యను అందిస్తున్నామన్నారు. సమావేశంలో రిజిస్ర్టార్‌ శ్రీనివాస్‌, సిల్వర్‌జూబ్లీ కళాశాల ప్రిన్సిపాల్‌ నాగరాజు శెట్టి, సిల్క డెవలప్‌మెంట్‌ అదికారి ఆనందరాజు, అడ్మినిస్ట్రేటర్‌ అక్తర్‌ భాను, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 11:23 PM