Share News

వందశాతం అక్షరాస్యతే లక్ష్యం

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:29 AM

రాష్ట్రంలో వందశాతం అక్షరా స్యత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కర్నూలు జడ్పీ సీఈవో నాసరరెడ్డి అన్నారు.

వందశాతం అక్షరాస్యతే లక్ష్యం
సిబ్బందితో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో నాసరరెడ్డి

కల్లూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వందశాతం అక్షరా స్యత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కర్నూలు జడ్పీ సీఈవో నాసరరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా అడల్ట్‌ ఎడ్యుకేషన ఆధ్వర్యంలో మహిళలు, పురుషులకు కల్లూరు మండలంలోని చిన్న టేకూరు ఎంపీపీ స్కూల్లో నిర్వహించిన అక్ష్యరాస్యత పరీక్షలను ఆయన పరీక్షా కేంద్రాన్ని పరిశీలిం చారు. డ్వామా, జిల్లా రూరల్‌ డెవల ప్‌ మెంట్‌ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన పరీక్షలకు మొత్తం 4,070 మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించాలన్న సంకల్పంతో ప్రభుత్వం కల్పించిన ఈఅవ కాశాన్ని సద్వినియోగించుకోవాలని సీఈవో కోరారు. ఎంపీడీవో జి.నాగశేషాచల రెడ్డి, ఏపీఎం పుష్పావతి అంగనవాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 12:29 AM