Share News

వందశాతం ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యం

ABN , Publish Date - Sep 10 , 2026 | 12:41 AM

నగరంలోని 137 సచివాలయాల పరిధిలో వందశాతం ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యంగా ముందుకు పోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు పారిశు పర్యవేక్షక ఉద్యోగులు, సిబ్బందిని ఆదేశించారు.

వందశాతం ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యం
మాట్లాడుతున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగర పాలక సంస్థ కమిషన ర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు కల్చరల్‌, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): నగరంలోని 137 సచివాలయాల పరిధిలో వందశాతం ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యంగా ముందుకు పోవాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు పారిశు పర్యవేక్షక ఉద్యోగులు, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం నగరంలోని ఎస్‌బీఐ ఎంప్లాయీస్‌ కాలనీలోని నగరపాలక సమావేశ హాలులో ఆయన ఈ-ఆటోలు కేటాయించిన పారిశుధ్య ఇనస్పెక్టర్లు, సచి వాలయ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ కొత్తగా అందుబాటులోనికి వచ్చిన ఎలకి్ట్రక్‌ ఆటోలను సమర్థవంతంగా వినియోగించుకునేలా పిన పాయింట్‌ ప్రోగ్రామ్‌ను పక్కాగా రూపొందిం చుకోవాలని సూచించారు. ఈ-ఆటోలకు కేటాయించిన మైక్రో పాకెట్ల పరిధిలో ప్రతి ఇంటి చెత్తను వందశాతం సేకరించేలా సచివాలయ కార్యదర్శులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ-ఆటో డ్రైవర్‌ సెలవు కారణంగా విధులకు గైర్హాజరైనా లేదా వాహనం మరమ్మతులకు గురైనా చెత్త సేకరణకు అంతరాయం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రజా రోగ్య అధికారి డాక్టర్‌ ఎం.రఘు, శానిటరీ సూపర్‌వైజర్‌ రమేష్‌బాబు, వాహనాల ఇనచార్జి కె. మధుబాబు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2026 | 12:41 AM