చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రానికి భవిష్యత్తు
ABN , Publish Date - Oct 16 , 2026 | 12:17 AM
సీఎం చంద్రబాబు నాయకత్వంతోనే రాష్ట్రానికి భవిష్యత్తు చేకూరనుందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి
ఆత్మకూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : సీఎం చంద్రబాబు నాయకత్వంతోనే రాష్ట్రానికి భవిష్యత్తు చేకూరనుందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు పట్టణంలోని జెండారచ్చ వీధికి చెందిన మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ బండిమాబు, మీర్ జలీల్, మీర్ ఇస్మాయిల్, మీర్ జైలాన్తో పాటు కిషన్సింగ్ వీధికి చెందిన సుశీలబాయి నేతృత్వంలో పలు కుటుంబాలు ఎమ్మెల్యే బుడ్డా సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపే దిశగా సీఎం చంద్రబాబు అహర్నిషలు కృషి చేస్తున్నారని వాఖ్యానించారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వైసీపీ నాయకుల స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొంది నప్పటి రూ.140కోట్లతో ఆత్మకూరు పట్టణానికి శాశ్వత తాగునీటి పథకాన్ని మంజూరు చేయించి 10వేల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వల పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అంతకుముందు పార్టీలోకి చేరిన వారు ఎమ్మెల్యేను గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు యుగంధర్రెడ్డి, కమతం శంకర్, కలిముల్లా, అబ్దుల్లాపురం బాషా, నబిరసూల్, వరాల మాలిక్, లాలు, రహీం పాల్గొన్నారు.