తొలి తిరుగుబాటు వీరుడు నరసింహారెడ్డి
ABN , Publish Date - Feb 23 , 2026 | 12:15 AM
1857లో సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన తొలి తిరుగుబాటు వీరుడు ఉయ్యాలవాడ నర సింహారెడ్డి అని జేసీ నూరుల్ ఖమర్ అన్నారు.
జేసీ నూరుల్ ఖమర్
కర్నూలు కలెక్టరేట్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): 1857లో సిపాయిల తిరుగుబాటు కంటే ముందే బ్రిటీష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన తొలి తిరుగుబాటు వీరుడు ఉయ్యాలవాడ నర సింహారెడ్డి అని జేసీ నూరుల్ ఖమర్ అన్నారు. ఆదివారం నర సింహా రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని జేసీతో పాటు సెట్కూరు సీఈవో వేణుగోపాల్, జిల్లా టూరిజం అధికారి లక్ష్మీనారాయణ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జేసీ మాట్లా డుతూ ఆయన త్యాగం, దేశభక్తి, ఆత్మగౌరవ పోరాటం భారత స్వాతంత్య్ర చరిత్రలో చిరస్మరణీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓర్వకల్లులోని కొత్త విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం ద్వారా ఆయన వారసత్వాన్ని గౌరవించిందని తెలిపారు.