స్వర్ణరథంపై ఆది దంపతులు
ABN , Publish Date - Apr 22 , 2026 | 11:30 PM
లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు.
మల్లన్నకు ఆరుద్ర నక్షత్ర పూజలు
శ్రీశైలం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు. గురువారం తెల్లవారుజామున స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాల తరువాత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు జరిపించారు. అనంతరం గంగాధర మండపం వద్ద స్వర్ణరథంపై స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజ లు చేసి గ్రామోత్సవం నిర్వ హించారు. సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు భక్తులను అలరించాయి. గ్రామోత్సవంలో ఆలయ ఛైర్మెన్ పోతుగుంట రమే్‌షనాయుడు, పీఆర్‌వో శ్రీనివాసరావు, ఈఈ నర్సింహారెడ్డి, డీఈ శాస్త్రి ఉన్నారు.