Share News

స్వర్ణ రథంపై ఆది దంపతులు

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:24 AM

లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు.

స్వర్ణ రథంపై ఆది దంపతులు
గ్రామోత్సవంలో పాల్గొన్న ట్రస్ట్‌బోర్డు సభ్యులు

శ్రీశైలం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా జరిపించారు. గురువారం తెల్లవారు జామున స్వామిఅమ్మవార్ల నిత్య పూజలు చేశారు. గంగాధర మండపం వద్ద స్వర్ణ రథంపై ఆశీనులయ్యారు. . ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజల తరువాత స్వామిఅమ్మవార్లకు మహా మంగళ హారతులు ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించినట్లు ఆలయ ఛైర్మెన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు తెలిపారు.

Updated Date - Mar 27 , 2026 | 12:24 AM