స్వర్ణరథంపై ఆది దంపతులు
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:32 PM
లోక కల్యా ణాన్ని కాంక్షిస్తూ ఆరుద్రోత్సవాన్ని శ్రీశైలంలో నిర్వహిం చారు.
నందివాహనంపై దర్శనమిచ్చిన స్వామి, అమ్మవార్లు
వైభవంగా గ్రామోత్సవం
శ్రీశైలం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): లోక కల్యా ణాన్ని కాంక్షిస్తూ ఆరుద్రోత్సవాన్ని శ్రీశైలంలో నిర్వహిం చారు. శనివారం తెల్లవారుజామున స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాల తరువాత ఉత్సవమూర్తులను స్వామి వారి ముఖమండపంవద్ద ఉత్తరముఖంగా ఆశీ నులచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాజీ ఉత్తర గోపురం నుండి నందివాహనంపై గ్రామోత్సవాన్ని ఆరం భించారు. అనంతరం గంగాధర మండపం వద్ద స్వర ్ణరథంపై స్వామి, అమ్మవార్లకు ఆరుద్ర నక్షత్ర ప్రత్యేక పూజ లు చేశారు. స్వర్ణరథం వద్ద వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారుల నృత్యాలు అలరించాయి. గ్రామోత్సవంలో ఈఈ నర్సింహరెడ్డి, పీఆర్‌వో శ్రీనివాసరావు, ఎడిటర్ అనిల్ కుమార్, సీఎస్‌వో శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.