అశ్వవాహనంపై ఆది దంపతులు
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:08 AM
శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్ర హ్మోత్సవాలు ఈనెల 11న ప్రారంభమై ఆదివారం ముగిశాయి.
శ్రీశైలంలో కనుల పండువగా ఆలయోత్సవం
ముగిసిన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం, జనవరి 18(ఆంధ్రజ్యోతి): శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్ర హ్మోత్సవాలు ఈనెల 11న ప్రారంభమై ఆదివారం ముగిశాయి. అర్చక వేదపండితులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవా ర్లకు ప్రత్యేక పూజలు వాహన సేవలు జరిపించారు. ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ప్రత్యేకంగా వివిధ రకాల పూలతో అలంకరించిన వేదికపై అశ్వవాహనాధీశులైన ఆదిదం పతులకు పూజలుచేసి మంగళ హారతులిచ్చారు. సాంస్కృతిక కళారూపా లు, చెంచుల నృత్యాల నడుమ ఆలయోత్సవం కనుల పండువగా సాగింది.
శోభాయమానంగా పుష్పోత్సవం
పుష్పోత్సవ, శయనోత్సవ ఏకాంతసేవ వేడుక శోభాయమానంగా జరి గింది. పుష్పోత్సవంలో ప్రత్యేక పుష్పాలైన కాగడాలు, ఎరుపు, తెలుపు, ప సుపు రంగుల గులాబీలు తదితర మర్వ పత్రాలతో నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి వరకు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజాధికాలు శాస్త్రోక్తంగా జరిపించడంతో బ్రహ్మోత్సవాలు ముగిశా యని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక కార్యక్రమాలను తిల కించేందుకు వచ్చిన భక్తులకు దర్శనం సౌకర్యాలు కల్పించడంలో సఫలమైన అధికారులు, సిబ్బందిని అభినందించారు. సోమవారం నుంచి ఆలయ దర్శన విధానాలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు.